
రద్దు వెబ్ జైన్ లో నా కవిత పెర్వర్షన్ వర్షన్ వచ్చింది.
పూర్తి కవిత ఇక్కడ ఉంచుతున్నాను.
-----------------------------------------
నీ శాపనార్ధాలతో అలవాటయిన మనసు
సమ సాంద్రత రక్తాన్ని
కళ్ళలో నింపి రక్తకన్నీళ్ళొదిలింది
అచ్చంగా...
ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది
నువ్వు థూ అని ఉమ్మేసినప్పటికినీ
నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
తుడుచుకునేందుకు పురికొల్పలేదు
నాలో సిగ్గు చచ్చిందా?
లేక...
ఇలాంటి థూ థూ ల వరస
అలవాటయ్యిందా!
పైత్యం తెలిసిన మెదడు
ఈ ఛీత్కారానికి
హేతువు కోరింది
పిచ్చి గాలి చెంప చెళ్ళుమన్న శబ్దం...
కనీసం కొలిచైనా
సాంత్వన పొందే
అవకాశం వెదికింది
నీ ఛీత్కార మటలు(?) ఎగసాయి
ఆ ఓర్చుకోలేని తిట్లను భరిస్తూ
నాలోని సిగ్గులు సంతకెళ్తున్నాయ్
వర్షించే కళ్ళతొ
అర్థనగ్నంగా (ఎప్పట్లానే గుడ్డలూడదీసుకుని అద్దం ముందు)
నేను కూర్చునే ఉన్నాను
అప్పుడు తెలిసింది...
M.F హుస్సేను నా నగ్న చిత్రాన్నే గీస్తున్నాడని.
ఆఖరు లైన్ అదిరింది
ReplyDeleteఅప్పుడు తెలిసింది...
ReplyDeleteM.F హుస్సేను నా నగ్న చిత్రాన్నే గీస్తున్నాడని.
ఏ పెన్సిల్తో ???
Ha..ha... ha.. 2B pencil tho
ReplyDeleteyou are very hilarious uresh, simply excellent !
ReplyDeleteeagerly waiting for your new posts ! we are missing panashaala and you.
ReplyDeleteఅన్నా ఎక్కడికెళ్ళావే...జర ఆ కంపుశాల జూడు..ఎక్కడ మీ పేరడీ?
ReplyDeletechaala baagundi.............excellent........asalu title pedda keka
ReplyDelete