Thursday, June 10, 2010

దళిత ఉద్యమానికి ‘కత్తి మోడల్’ కావాలా !



ఈ మధ్య ఒక మిత్రుడితో వ్యవస్థీకృత సమాజంలో నిండుకున్న గోమాంసం గురించి. పోర్న్(పోస్టు మోడర్నిజమ్)లేమిని గురించి. భావజాలాలలోని కుతి గురించి చర్చిస్తుంటే ఒక విలువైన చారిత్రక సమాచారం గుర్తుకు తెచ్చుకోవటం జరిగింది.

బ్లాగులు పుట్టినప్పటినుంచీ నే జరుపుతున్న దళిత ఉద్యమానికి నేను నమ్ముకున్న 'గే'లాలు వెన్నుపోటు పొడిచినా, ఆ ఉద్యమం పుణ్యమా అని కొందరు మహిళా బ్లాగర్లలో, మరికొందరు కొత్త బ్లాగర్లలో నా ఆశయాల స్పృహమాత్రం చాలా మెండుగా వచ్చింది. నేను కేసు వేస్తానన్న తరువాత కూడా చాలావరకూ బ్రాహ్మణ కుల ఆధిపత్యంలో ఉన్న తెలుగుబ్లాగులపై పట్టుసాధించడానికి మా వర్గం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

అది 2010 ఫిబ్రవరి 14 (నాలుగు నెలల మాట)
వేదిక: కృష్ణకాంత్ పార్క్, ఎర్రగడ్డ
సందర్భం: తెలుగు బ్లాగర్ల సమావేశం
పోటీదారులు: మలక్పేట రౌడీ గారు బలపరిచిన గేలం శరత్, కుళ్ళే దన్నుగా నిలబడిన నేను

అదొక స్వలింగ సంపర్కం... సారీ స్వలింగ సమరం. నువ్వా – నేనా అన్నట్టు ప్రతిష్టాత్మకంగా సాగిన పోటి. తెలుగు బ్లాగుల్లో రాజకీయ ప్రాబల్యాన్ని నిరూపించే, నిర్దేశించే అతి కీలకమైన పోటి. మలక్పేట చాణక్యంతో గేలం గెలిచారు.

నా వర్గం (వర్ణం) ఈ ఘోర ‘అవమా’నాన్ని సహించలేకపోయింది. వాక్చాతుర్యం, సినిమాలకు మాటలు రాసే సామర్ధ్యం ఉండి, ఒక విధంగా తమ రాజ్యంగా చెప్పబడే హైదరాబాదులో నేను కాక ఎక్కడినుంచో వచ్చిన కెనడా అభ్యర్థి గెలుపు వారికి మింగుడు పడలేదు. తెలుగు బ్లాగర్లు ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నప్పుడు, నా వర్గాలలో ప్రముఖులైన సో సిస్టర్స్ - సోమక్క, సోదక్క(పారిజాతక్క) తమ వర్గ సమావేశానికి తక్షణ పిలుపునిచ్చారు. స్త్రీవాద, వదినోధ్ధారకుడైన వండంగి ప్ర.నా. వారి తర్వాత, బ్లాగుల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగింది నేనేనని(400 పోస్ట్లు, 82 మంది ఫాన్సూ)తీర్మానిస్తూ పార్టీలతో సంబంధం లేకుండా వర్గ ప్రముఖలందరూ పక్కనున్న ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి పార్కులో సమావేశమయ్యాం. ఇంత 'అంగ'బలం, గొడ్డు బలం ఉండి కూడా మలక్పేట రౌడీ అనే బ్రాహ్మణుడి వ్యూహానికి చిత్తవడం మీదే చర్చ ప్రధానంగా సాగింది. బ్రాహ్మణాధిక్యత మీద మేం అప్పటికి అర్థ దశాబ్ది పైగా చేస్తున్న బ్లాగు యుద్ధాన్ని భూమార్గం పట్టించి, పోరు ప్రత్యక్షం చేయవలసిన అవసరాన్ని ఆ సభ నొక్కి చెప్పింది. తత్ఫలితంగా సభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలలో కొన్ని.
1. ఆడబ్లాగరైనా, మగబ్లాగరైనా తమ తమ బ్లాగుల్లో హిందూ సంస్కృతిని ఎండగొడుతూ రోజుకొక పోస్టు రాయాలి.
2. అలా రాసిన పోస్టులకు మన కేతిగాళ్ళంతా డప్పులు కొడుతూ కామెంట్లతో జేజేలు పలకాలి.
3. సంస్కృతి లోని గొప్పదనాన్ని, తీయందనాన్ని వర్ణిస్తూ 'ఆ' వర్గం రాసే టపాలని కామెంట్లతో చీల్చి చెండాడాలి.
(నా బాధ్యత నేనాల్రడీ మొదలెట్టేసానోచ్)

ఇవన్ని తక్షణ ప్రణాళికలు కాబట్టి, ఇక దీర్ఘకాలంలో అమలు చేయడానికి వ్యాపార రంగాన్ని ఆశ్రయించాలని, ఆ వ్యాపారులు కచ్చితంగా ‘క్యాష్ ఓరియంటెడ్’ గా మాత్రమే ఉండాలని సభ తీర్మానించింది. అంటే, కస్టమర్లు ముందే డబ్బు చెల్లించే వ్యాపారులు: సినిమాలకు మాటలు రాయటం, డైరక్టర్లనూ ఇంటర్యూలంటూ కాకా పట్టటం, యువతరంగానికి చందాలు వసూలు చేయటం…. వంటి ‘అప్పు’పెట్టే రిస్కులేని వ్యాపారాలు మాత్రమే చేయాలన్నిది తీర్మాన సారాంశం.

సభ ఆమొదించిన తీర్మానాలు మావర్గానికి శిరోధార్యాలయ్యాయి. తు.చ తప్పకుండా అమలవడంతో గురి తప్పలేదు; లక్ష్యం నెరవేరుతూనే ఉంది. ఇదే ‘కత్తి మోడల్’.