Monday, April 5, 2010

‘రద్దు’లో నా కవిత - గుడ్డలూడదీసుకుని నేను




రద్దు వెబ్ జైన్ లో నా కవిత పెర్వర్షన్ వర్షన్ వచ్చింది.
పూర్తి కవిత ఇక్కడ ఉంచుతున్నాను.
-----------------------------------------

నీ శాపనార్ధాలతో అలవాటయిన మనసు
సమ సాంద్రత రక్తాన్ని
కళ్ళలో నింపి రక్తకన్నీళ్ళొదిలింది
అచ్చంగా...
ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది

నువ్వు థూ అని ఉమ్మేసినప్పటికినీ
నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
తుడుచుకునేందుకు పురికొల్పలేదు
నాలో సిగ్గు చచ్చిందా?
లేక...
ఇలాంటి థూ థూ ల వరస
అలవాటయ్యిందా!

పైత్యం తెలిసిన మెదడు
ఈ ఛీత్కారానికి
హేతువు కోరింది
పిచ్చి గాలి చెంప చెళ్ళుమన్న శబ్దం...
కనీసం కొలిచైనా
సాంత్వన పొందే
అవకాశం వెదికింది

నీ ఛీత్కార మటలు(?) ఎగసాయి
ఆ ఓర్చుకోలేని తిట్లను భరిస్తూ
నాలోని సిగ్గులు సంతకెళ్తున్నాయ్
వర్షించే కళ్ళతొ
అర్థనగ్నంగా (ఎప్పట్లానే గుడ్డలూడదీసుకుని అద్దం ముందు)
నేను కూర్చునే ఉన్నాను

అప్పుడు తెలిసింది...
M.F హుస్సేను నా నగ్న చిత్రాన్నే గీస్తున్నాడని.

Sunday, April 4, 2010

ఛండాలమైన సినిమా: చూడ్డానికి సాధారణంగా కుదరని సినిమా - న్యూ



పెద్దమనిషినయ్యిన రెండు వారాల వరకు బ్లాగకుండాకుండా ఆపితే, ఇప్పుడు సుత్తి నరేష్ అసలు పేరడీ చేయాలా వద్దా చెయ్యాలా వద్దా అనే మీమాంశలో ఉన్న మాసం "ఏప్రిల్". గొడ్డు మాంసం పోస్ట్ తో విమర్శకులతో థూ అనిపించుకున్నా, నగ్నదేవతలు టపాతో బ్లాగర్లందరి తిట్లూ తిన్నా నాకు ఇసుమంతైనా ఇంగితం రాకపోవటం నా స్పెషాలిటీల్లో ఒకటి అనుకోవాలేమో.

ఈ మధ్యనే ఓ సినిమాకు మాటలు రాస్తున్నాను. "ఎలా?" అని అడక్కండి (పెన్నుతో అని చెప్తాను). ఇప్పటికే సైన్మా ఫీల్డులో పనికిమాలినోళ్ళు ఉన్నారనడానికి నేనొక ఉదాహరణ అంతే. "ఈ వెధవకు బుధ్ధిరాదా?" అని అడక్కండి. నా బ్లాగు కొంత explore చేస్తే మీకు నా వెధవత్వం పై పూర్తి అవగాహన కలిగి సానుభూతి కలుగుతుంది. సినిమాలో నే రాసిన మాటలు మాత్రం బ్రహ్మాండం. తప్పకుండా చూడాల్సిన డైలాగులు (నిజానికి బ్లాగర్లందరూ నన్ను తిట్టిన బూతులే నా సినిమాలో డైలాగులు.) అంతే!