
రద్దు వెబ్ జైన్ లో నా కవిత పెర్వర్షన్ వర్షన్ వచ్చింది.
పూర్తి కవిత ఇక్కడ ఉంచుతున్నాను.
-----------------------------------------
నీ శాపనార్ధాలతో అలవాటయిన మనసు
సమ సాంద్రత రక్తాన్ని
కళ్ళలో నింపి రక్తకన్నీళ్ళొదిలింది
అచ్చంగా...
ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది
నువ్వు థూ అని ఉమ్మేసినప్పటికినీ
నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
తుడుచుకునేందుకు పురికొల్పలేదు
నాలో సిగ్గు చచ్చిందా?
లేక...
ఇలాంటి థూ థూ ల వరస
అలవాటయ్యిందా!
పైత్యం తెలిసిన మెదడు
ఈ ఛీత్కారానికి
హేతువు కోరింది
పిచ్చి గాలి చెంప చెళ్ళుమన్న శబ్దం...
కనీసం కొలిచైనా
సాంత్వన పొందే
అవకాశం వెదికింది
నీ ఛీత్కార మటలు(?) ఎగసాయి
ఆ ఓర్చుకోలేని తిట్లను భరిస్తూ
నాలోని సిగ్గులు సంతకెళ్తున్నాయ్
వర్షించే కళ్ళతొ
అర్థనగ్నంగా (ఎప్పట్లానే గుడ్డలూడదీసుకుని అద్దం ముందు)
నేను కూర్చునే ఉన్నాను
అప్పుడు తెలిసింది...
M.F హుస్సేను నా నగ్న చిత్రాన్నే గీస్తున్నాడని.